Supreme Court: దేశంలో ఇటీవల వెలుగు చూస్తున్న ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ తరహా సైబర్ నేరాల కేసులపై దర్యాప్తు ప్రారంభించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల దర్యాప్తుకు సీబీఐ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read: Revanth Reddy: మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి
సైబర్ క్రైమ్ మోసాల్లో కొత్త రూపంగా మారిన ఈ ‘డిజిటల్ అరెస్టులు’ దేశవ్యాప్తంగా అనేక మందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి, మోసగాళ్లు అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ స్కామ్‌ల వెనుక ఉన్న ముఠాలను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. దేశ పౌరుల భద్రతకు, సైబర్ భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి మోసాలను ఉపేక్షించబోమని న్యాయస్థానం తెలియజేసింది.

