Sudheer Babu: హైదరాబాద్‌లో జరుగనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సమ్మిట్ కోసం దాదాపు ఆరు వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ యొక్క ఎగ్జిట్ నంబర్ 14 నుంచి సమ్మిట్ వేదిక వరకు మొత్తం ప్రాంతంలో భద్రతను మరింత పటిష్ఠం చేశారని తెలిపారు.
ఇప్పటికే ప్రజా వేదికను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నామని, సమ్మిట్‌కు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తామని కమిషనర్ సుధీర్ బాబు స్పష్టం చేశారు.

