Suchir India: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త వై. కిరణ్ కొన్నేళ్ళుగా తన పుట్టిన రోజును ‘సంకల్ప దివస్’గా జరుపుతున్నారు. ఆ రోజున జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మానవతావాదులను ఆయన ఘనంగా సత్కరిస్తున్నారు. ఈ యేడాది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు, మానవతావాది సోనూసూద్ ను కిరణ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారత్-బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్. ఈ. నికోలాయ్ యాంకోవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 50 ప్రత్యేక పాఠశాలల నుండి విద్యార్థులు హాజరు కావడం ఆనందంగా ఉందని కిరణ్ అన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం తనకు దక్కడం పట్ల సోనూసూద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్న పలువురిని ‘సంకల్ప్ సేవా పురస్కార్’తో సత్కరించడం విశేషం.
