Srisailam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ హుండీ ఆదాయం భారీగా పెరిగింది. గడిచిన 28 రోజుల్లో భక్తుల నుంచి విశేష కానుకలు సమకూరాయి. భక్తుల నుంచి మల్లన్న ఆలయానికి రూ.4,14,15,623 నగదు, 322 గ్రాముల బంగారం, 8.5 కిలోల వెండి, ఇతర విదేశీ కరెన్సీ సమకూరింది. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘాలో ఈ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కార్తీక మాసం కావడంతో పాటు అయ్యప్పస్వాములు పెద్ద సంఖ్యలో దర్శనాలు పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగిందని ఆలయాధికారులు పేర్కొన్నారు.

