Smriti Mandhana: క్రికెట్ ప్లేయర్ స్మృతి మంధాన తన పెళ్లిని రద్దు చేసుకున్నది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె ఈ ప్రకటనను విడుదల చేసింది. తన ప్రియుడు, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో తన పెళ్లిని రద్దు చేసుకున్నట్టు
స్మృతి మందాన ప్రకటించడం సంచలనంగా మారింది. వారిద్దరి యంగేజ్మెంట్ జరిగిన కొన్నాళ్లకే వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వారు వైవాహిక బంధంపై వచ్చిన రకరకాల పుకార్లపై ఫుల్స్టాప్ పడింది.
Smriti Mandhana: గత కొన్ని వారాలుగా తన జీవితం గురించి చాలా ఊహాగానాలు చెలరేగాయని, ఈ సమయంలో తాను మాట్లాడటం చాలా ముఖ్యమని భావించినట్టు మంధాన ఆ పోస్టులో తెలిపారు. తాను చాలా వ్యక్తిగత ఆసక్తులకు ప్రాధాన్యం ఇస్తానని, అలాగే తన జీవితం ఉండాలని కోరుకుంటానని, అందుకే వివాహం రద్దయిన విషయాన్ని బహిర్గతం చేయాలని భావించినట్టు చెప్పారు.
Smriti Mandhana: ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని ఆమె అందరినీ వేడుకున్నారు. తమ రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలని, తమ సొంత నిర్ణయాలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. వేర్వేరు అభిప్రాయాలతో ముందుకు సాగేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుకున్నారు. వీలైనంత కాలం భారతదేశం తరఫున ఆడటం, ట్రోఫీలు గెలవడం కోసం కృషి చేయాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తనను అర్థం చేసుకుంటారని మనవి అని వేడుకున్నారు.

