Paneer Side Effects: ఏదైనా ఎక్కువగా తీసుకోవడం హానికరం. పనీర్ విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది. పనీర్ ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తి. ప్రతిరోజూ తినాలని సిఫార్సు చేస్తారు. అయితే రోజు తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయా? తీవ్రమైన పరిణామాలను నివారించడానికి పనీర్ పరిమిత పరిమాణంలో తినాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. పనీర్ కాల్షియం, ప్రోటీన్ వంటి మూలకాల ప్రధాన మూలం. కానీ కొన్నిసార్లు ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. అందుకే రోజూ పన్నీర్ తినేవాళ్లు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. వనీర్ రోజువారీ ప్రోటీన్, కాల్షియం తీసుకోవడానికి మంచి మూలమని నిపుణులు చెబుతున్నారు.
అయితే సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 90 నుండి 100 గ్రాముల పనీర్ను మాత్రమే తీసుకోవాలి. ఇంత కంటే ఎక్కువ పనీర్ తింటే తీవ్ర సమస్యలు వస్తాయని కూడా చెబుతున్నారు. బరువు పెరుగుట: పనీర్ లో అధిక స్థాయిలో కొవ్వు ఉంటుంది. దీని కారణంగా పనీర్ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంలోని క్యాలరీల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది బరువు పెరగడానికి కారణం కావచ్చు. కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుదల: పనీర్లో చెడు కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని అసమతుల్యత చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో పనీర్ ఎక్కువగా తినకుండా ఉ ండటం చాలా ముఖ్యం.
Paneer Side Effects: ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరుగుదల గుండె జబ్బులను కూడా పెంచుతుంది. జీర్ణ సమస్యలు: రోజులో ఎక్కువ పనీర్ తినడం వల్ల మలబద్ధకం, అతిసారం, అసిడిటీ వంటి జీర్ణ నమస్యలు వస్తాయి. పనీర్ జీర్ణవ్యవస్థను బాగా ప్రభావితం చేస్తుంది. కిడ్నీ స్టోన్: పనీర్ తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. శరీరంలో కాల్షియం ఎక్కువగా ఉ ండటం కూడా మంచిది కాదు. ఇది కాల్షియం నుండి ఏర్పడిన రాళ్ల పెరుగుదలకు దారితీస్తుంది.

