Suriya 44: రెండు దశాబ్దాలకు పైగా కథానాయికగా చిత్రీసీమలో రాణిస్తోంది శ్రియా శరన్. విశేషం ఏమంటే కెరీర్ మొదలెట్టిన కొంతకాలానికే ఐటమ్ సాంగ్స్ కూడా చేయడం ప్రారంభించింది. 17 సంవత్సరాల క్రితం శ్రియా మొదటి ఐటమ్ సాంగ్ చేయగా ఇప్పటికీ… 42 సంవత్సరాల వయసులోనూ ఐటమ్ సాంగ్స్ ఆఫర్స్ ఆమెకు వస్తున్నాయి. తాజాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటిస్తున్న మూవీలో ఐటమ్ సాంగ్ చేసినట్టు ఆమె తెలిపింది. వచ్చే నెలలో ఈ పాట విడుదలయ్యే ఆస్కారం ఉంది. పెళ్ళి చేసుకుని, ఓ పాపకు జన్మనిచ్చిన శ్రియా ఇప్పటికే నటిగా కొనసాగుతోంది. తెలుగులో ఓ పాన్ ఇండియా సినిమాలో ఆమె నటించబోతోందని తెలుస్తోంది.
