China Masters Super 2024

China Masters Super 2024: సెమీస్‌లో సాత్విక్‌ జోడీ

China Masters Super 2024: చైనా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 21-16, 21-19తో రెండో సీడ్‌  డెన్మార్క్ కు చెందిన కిమ్‌ ఆస్ట్రప్‌- ఆండర్స్‌ రస్‌ముసెన్‌ జోడీపై విజయం సాధించింది.47 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో వరుస గేమ్‌ల్లో ప్రత్యర్థిని భారత జోడీ చిత్తుచేసింది. పురుషుల సింగిల్స్‌లో స్టార్‌ ఆటగాడు లక్ష్యసేన్‌కు పరాజయం పాలయ్యాడు. క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ 18-21, 15-21తో మూడో సీడ్‌, డెన్మార్క్ షట్లర్ ఆండర్స్‌ ఆంథోన్సెన్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  IND vs SA: సిరీస్ గెలుపు కప్పేసిన సమస్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *