Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి బ్లాక్ బస్టర్ పొంగల్ పాట రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన లభించి సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. తాజాగా అన్ స్టాపబుల్ లో బాలయ్యతో కలసి వెంకీ చేసిన సందడి అందరినీ అలరిస్తోంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ పాట సైతం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. భీమ్స్ సంగీతం అందించిన ఈ పాటను భీమ్స్ తో కలసి రోహిణి సొరట్, వెంకటేశ్ పాడారు. విన్న ప్రతి ఒక్కరూ ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా విజయంలో ఈ పాటకు చోటు ఉందన్నది శ్రోతల అభిప్రాయం. మరి వారితో ఎంత మంది ఏకీభవిస్తారో చూడాలి.