Mrunal Thakur: టాలీవుడ్‌లో ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఇటీవల తన సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)తో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వచ్చిన వార్తలపై మృణాల్ ఠాకూర్ స్పందించారు. ఈ ప్రచారానికి ఆమె సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో చెక్ పెట్టారు.
రూమర్స్‌పై మృణాల్ స్పందన
తనపై వస్తున్న పుకార్లను నటి హాస్యాస్పదంగా కొట్టిపారేశారు. “ఇలాంటి రూమర్స్ వినడానికి కూడా నవ్వొస్తుంటుంది. వాళ్లు ఏదో ఒకటి వార్తలు సృష్టిస్తుంటారు. వాటిని చూసి నేను నవ్వుకుంటాను. ఇవన్నీ నాకు ‘ఫ్రీ పీఆర్ స్టంట్స్’ లాంటివి. నాకు ఉచితంగా వచ్చే ప్రచారం అంటే చాలా ఇష్టం” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ విధంగా, ఆమె శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని, ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉంటూ పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి పెట్టానని పరోక్షంగా తెలియజేశారు.
Also Read: Jaya Bachchan: “వివాహంపై నా సలహా అక్కర్లేదు”: నేటి తరం ఆలోచనలపై జయా బచ్చన్ వ్యాఖ్యలు
మృణాల్ ఠాకూర్పై ఇలాంటి పుకార్లు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తమిళ స్టార్ హీరో ధనుష్తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో ధనుష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేస్తూ ఆ వార్తలను కూడా ఆమె ఖండించారు. అలాగే, ఒక టాలీవుడ్ నటుడిని ఆమె వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా కొంతకాలం క్రితం నెట్టింట చర్చ జరిగింది.
సినిమాలతో బిజీ
కెరీర్ విషయానికొస్తే, మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ‘సన్నాఫ్ సర్దార్ 2’ తో ప్రేక్షకులను పలకరించిన ఆమె, ‘దో దీవానే షహర్ మే’ సహా మరికొన్ని హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో అడివి శేష్ సరసన నటిస్తున్న ‘డెకాయిట్’ చిత్రం హిందీలోనూ విడుదల కానుంది. అంతేకాకుండా, అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో కూడా ఆమె ఓ హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వచ్చినా, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

