Road Safety: శీతాకాలంలో మంచుకురిసే సమయాల్లో వాహన ప్రయాణం కడు ప్రమాదకరం. తెలిసి ఎందరో వాహనదారులు లైట్లు వేసుకొని మరీ ప్రయాణిస్తూ ఉంటారు. ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. కానీ మంచు కురుస్తున్న సమయాల్లో అసలు ప్రయాణాన్నే వాయిదా వేసుకొని.. అది విచ్చుకున్నాక క్షేమంగా ప్రయాణించాలి. దీనితోపాటు ఆ వేళలో ప్రయాణించడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదని ఆరోగ్యాభిలాషులు సూచిస్తున్నారు.
Road Safety: చలికాలం పెరిగిన కారణంగా మంచు పడే రాత్రి వేళల్లో, ముఖ్యంగా తెల్లవారుజామున వాహనాలు నడిపే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ కాలంలో ఏటా ఎందరో మరణాన్ని కొనితెచ్చుకుంటున్నారని వారు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో ఓవర్టేక్ చేయడం, మ్యూజిక్ పెట్టుకొని వాహనాలు నడపడం చేయవద్దని సూచిస్తున్నారు.
ద్విచక్ర వాహనదారులు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1) హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి
2) హై-బీమ్ వాడవద్దు. లో-బీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలి
3) వేగం తగ్గించి ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలి
4) రిఫ్లెక్టివ్ జాకెట్లు, స్టిక్కర్లు వాడుకోవాలి
5) సడన్ బ్రేకులు వేయకుండా జాగ్రత్త పడాలి. రోడ్డు తడిగా ఉంటే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నది.
6) మూల మలుపులు వచ్చే ముందు ఇంటికేటర్ తప్పకుండా ఇవ్వాలి
7) రాత్రి/తెల్లవారుజామున ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలోనే పొగమంచు తీవ్రత ఎక్కువ
8) గ్లౌవ్స్ తప్పనిసరిగా ధరించాలి. చేతులు చల్లబడితే వాహన నియంత్రణ తగ్గుతుంది.
కార్లు, భారీ వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1) ఫాగ్ ల్యాంప్స్ లేదా లో-బీమ్ లైట్లు మాత్రమే వాడాలి
2) వేగం తగ్గించి నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలి
3) ముందున్న వాహనానికి సాధారణ దూరం కంటే 3, 4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి
4) డిఫాగర్ ఉపయోగించాలి/విండోలుకొద్దిగా ఓపెన్ చేసి ఫాగింగ్ నివారించాలి
5) హాజర్డ్ లైట్లు విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు వాడాలి.
6) పొగమంచు లేదా కర్వ్ ప్రాంతాల్లో ఓవర్ టేక్ చేయవద్దు.
7) లైన్ మార్కింగ్లు, రోడ్ రిఫ్లెక్టర్లను గమనిస్తూ నడపాలి.
8) వైపర్స్, లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలి.
9) సడన్ బ్రేకులు లేదా మలుపుల వద్ద వేగాన్ని నివారించాలి.

