Road Accident:రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని చౌరస్తాలో శనివారం (జూలై 26) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరూ బైక్‌పై వెళ్తుండగా, ఓ ట్యాంకర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలతో తండ్రీ కూతురు కొట్టుమిట్టాడుతూ రోడ్డుపై హృదయ విదారకంగా వేడుకున్న వైనం అక్కడివారికి కన్నీళ్లు తెప్పించింది. తీవ్రగాయాలతో విలవిల్లాడుతూ కొంతసేపటికి ఇద్దరూ కన్నుమూశారు.
Road Accident:షాద్‌నగర్ పట్టణానికి చెందిన మచ్చేందర్.. తన కూతురు మైత్రిని శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలకు పంపేందుకు బస్టాండ్ వద్ద దించేందుకు తన బైక్‌పై వెళ్లారు. షాద్‌నగర్ చౌరస్తా వద్దకు వెళ్లగానే, డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ ట్యాంకర్ వాహనం.. బైక్‌ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆ ట్యాంకర్ కింద పైడి తండ్రీ కూతురు తీవ్రగాయాలపాలయ్యారు.
Road Accident:లారీ టైర్ కింద పడి ఉన్న మైత్రి తన ఫోన్‌ను అక్కడే ఉన్న వారికి ఇచ్చి తమ వారికి చెప్పాలని వేడుకున్నది. నన్ను కాపాడండి.. అంటూ వేడుకున్నది. తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడిన వైనం చూసిన వారికి కన్నీళ్లు వచ్చాయి. ఆమెకు కాల్స్ చేసిన వారికి ఫోన్ చేసి ప్రమాదం విషయం తెలిపారు. కొంతసేపటికి తీవ్రగాయాలతో బాధపడుతూ తండ్రీకూతురు ఇద్దరూ చనిపోయారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాలను షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

