Jai Hanuman: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా ‘హనుమాన్’ సూపర్ హిట్ అయిన తర్వాత అందరూ ఎదురుచూస్తున్న సీక్వెల్ ‘జై హనుమాన్’. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా చేస్తున్న ఈ భారీ చిత్రం ఇప్పటివరకూ ఆలస్యమవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఫైనల్ గా సినిమా పట్టాలెక్కనుంది. రిషబ్ డేట్స్ లాక్ చేసినట్టు సమాచారం.
Also Read: Akhil Akkineni: లెనిన్ క్లైమాక్స్ కోసం అఖిల్ స్పెషల్ ట్రైనింగ్?
గతంలో 2025లోనే ప్రారంభమవుతుందని అనౌన్స్ అయినా రిషబ్ శెట్టి బిజీ షెడ్యూల్ కారణంగా ‘జై హనుమాన్’ ఆలస్యమైంది. కాంతార-2, మరికొన్ని పెద్ద ప్రాజెక్టులతో ఆయన డేట్స్ ఫిక్స్ కాలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. వచ్చే ఏడాది జనవరి నుంచి వరుసగా ఐదారు నెలలు రిషబ్ శెట్టి పూర్తి కాల్ షీట్ ఇస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఈ డేట్స్ ను లాక్ చేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ‘హనుమాన్’ కంటే ఎలివేషన్ ఎక్కువగా ఉంటుందని యూనిట్ చెబుతోంది. సినిమా పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా ‘జై హనుమాన్’ అభిమానులకు ఇది పెద్ద గుడ్ న్యూస్. త్వరలోనే అధికారిక అప్డేట్స్ రానున్నాయి.

