Rave Party

Rave Party: ఫంక్షన్‌ హల్లో రేవ్ పార్టీ కలకలం..

Rave Party: వెయ్…దెబ్బకు స్టేజి మొత్తం ఉగాలా. కత్తిలాంటి అమ్మాయిలు .చేతిలో మందు బాటిల్. రాత్రంతా తాగాలా ఉగాలా ? ఇదే కాన్సెప్ట్ తో ఓ పార్టీ. అందరు వచ్చారు.అందరిలో అందమైన అమ్మాయిలు ఉన్నారు. కాని…అనుమతి లేదు. మరి ఎలా . మనల్ని ఎవడ్రా అడిగేది అనుకున్నారు. పార్టీ షురూ చేశారు . ఆహా మాకే తెలియకుండా ముక్క మందు మగువతో మస్త్ ఎంజాయ్ చేస్తున్నారా అంటూ అక్కడికి ఖాకీలు ఎంటర్ అయ్యారు. ఇనాకేముంది ఎవడి దారిన వాడు జంప్

Rave Party: న్యూఇయర్ వేళ రేవ్ పార్టీలకు సిద్దమవుతున్నారు కొందరు వ్యక్తులు. అటు వైపు పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీని భగ్నం చేశారు. మొత్తం ఐదుగురు అమ్మాయిలు, 10 మంది యువకులు పట్టుబడ్డారు. రాజమండ్రికి చెందిన 10 మంది యువకులు భారీగా రేవ్ పార్టీకి ప్లాన్ చేశారు. న్యూఇయర్ వస్తుండగా గుంటూరు నుంచి ఐదుగురు అమ్మాయిలను రాజమండ్రికి రప్పించారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఉన్న నాగసాయి ఫంక్షన్ రేవ్ పార్టీకి వేదికైంది.

Rave Party: రేవ్ పార్టీ వ్యవహారం పోలీసుల చెవిలో పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడి చేశారు. ఐదుగురు అమ్మాయిలతోపాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూడు కార్లు సీజ్ చేశారు. దాడులతో ఫంక్షన్ హాల్ యజమాని పరారీ అయ్యాడు. హాలు యజమాని లేకపోవడంతో కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీ కోరుకొండ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

పట్టుబడిన పలువురికి తమదైన కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసులు. అక్కడి నుంచి వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. రేవ్ పార్టీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా అనే దానిపై పరీక్షలు చేశారు. ఎవరూ తీసుకోలేదని తేలింది. ఇటీవల కాలంలో రేవ్ పార్టీలు గోదావరి జిల్లాల్లో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు అటు వైపు దృష్టి సారించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sheikh Rasheed: రషీద్‌ డబుల్‌ ... ఆధిక్యంలో ఆంధ్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *