Ayodhya Ram Temple: జూన్లో అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లాతో పాటు మరో 18 విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. 3 రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ పూజ కార్యక్రమం జరగనుంది. ఈ విగ్రహాలను రాజస్థాన్లోని జైపూర్లో తయారు చేస్తున్నారు. ఏప్రిల్ 15 తర్వాత అయోధ్యకు ఇవి చేరుకుంటాయి. దీని తర్వాత, ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా విగ్రహాలను సింహాసనంపై ప్రతిష్టిస్తారు. ఆ తర్వాత జూన్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. వేడుక జరిగే రోజులను ట్రస్ట్ సమావేశంలో నిర్ణయిస్తారు. ఈ విషయాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
జన్మస్థలంలో ఒక రాగి ఉడుతను ప్రతిష్టిస్తామని చంపత్ రాయ్ అన్నారు. విగ్రహాలు బరువైనవి. కాబట్టి, వారిని సింహాసనంపై ప్రతిష్టించడానికి పెద్ద యంత్రాల సహాయం తీసుకుంటారు. ఏప్రిల్ 30 నాటికి ఆలయ ప్రాంగణం నుండి టవర్ క్రేన్ తొలగిస్తారు. దీని తరువాత, ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సన్నాహాలు ముమ్మరం అవుతాయి. ఇప్పటికే అన్ని జెండా స్తంభాలు అక్కడకు చేరుకున్నాయి. ప్రాణ ప్రతిష్ఠకు ముందు వాటికీ సామూహిక పూజ జరుగుతుంది.
ఇది కూడా చదవండి: Vontimitta: ఏప్రిల్ 11న ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం.. దీని విశిష్టత ఏమిటో తెలుసా?
రామ జన్మభూమి వద్ద ఒక పెద్ద రాగి ఉడుత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని అందరూ చూడగలిగే ప్రదేశంలో ఉంచుతారు. రాముడు లంకకు చేరుకోవడానికి రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు, ఉడుత కూడా దానికి సహాయం చేయడానికి ప్రయత్నించిందని రామాయణంలో కథ ఉన్న విషయం తెలిసిందే.
ప్రాకారంలో నిర్మిస్తున్న సూర్యుడు, హనుమాన్, గణేష్, మాతా జగదాంబ, శంకర్, మాత అన్నపూర్ణ లతో కూడిన ఆలయాలు, సప్తమండపంలోని ఏడు ఆలయాలు పైభాగంలో కలశాన్ని ఏర్పాటు చేస్తారు . ఈ కలశాలన్నింటికీ సామూహిక పూజ పూర్తయింది. ఇప్పుడు ఈ కలశాలు వేర్వేరు తేదీలలో, శుభ సమయాలలో ప్రతిష్టిస్తారు.

