Rajnath Singh: ఆపరేషన్‌ సింధూర్‌ – భారత సైనిక సాహసానికి నిదర్శనం

Rajnath Singh: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం, దానికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతంగా పూర్తైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ ఆపరేషన్‌ భారత సైనికుల సాహసాన్ని, వ్యూహాత్మక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు.

22 నిమిషాల్లో ముగిసిన ఆపరేషన్‌

రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆపరేషన్‌ సింధూర్‌ కేవలం 22 నిమిషాల్లోనే విజయవంతంగా పూర్తయింది. ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన తెలిపారు. ఇది భారత భద్రతా దళాల సమర్థతకుసిద్ధతకు ప్రతీక అని ప్రశంసించారు.

పౌరుల భద్రతపై పూర్తి శ్రద్ధ

ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌ పౌరులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామన్న రాజ్‌నాథ్‌, “దేశ ప్రజల రక్షణ మా బాధ్యత. అదే సమయంలో అమాయకులకు హాని కలగకుండా చాలా జాగ్రత్తగా ప్రణాళిక రచించాం” అని వివరించారు.

ఆపరేషన్‌పై ఒత్తిడి లేదంటూ స్పష్టం

ఆపరేషన్‌ను నిలిపివేయాలని భారత ప్రభుత్వంపై ఎటువంటి అంతర్జాతీయ ఒత్తిడి రాలేదని ఆయన స్పష్టం చేశారు. పూర్తి స్వేచ్ఛతో, అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నామన్నారు.

పాకిస్తాన్ ఓటమిని అంగీకరించింది

పాకిస్తాన్‌ తన పరాజయాన్ని అంగీకరించినందుకే ఈ దశలో యుద్ధాన్ని నిలిపివేశామని మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. “భారత సైనికులకు నా సెల్యూట్‌. వారి ధైర్యం, నిబద్ధత దేశాన్ని గర్వించేలా చేస్తోంది,” అని ఆయన అన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *