Raja Singh: తెలంగాణ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన గోషామహల్ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్, “అన్నీ ఆలోచించే బీజేపీకి రాజీనామా చేశాను” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరిగి బీజేపీలో చేరేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు.
“నాపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీ హైకమాండ్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి నా రాజీనామాను ఆమోదించించారు,” అని రాజాసింగ్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీకి ఫైటర్ అవసరం ఉందని అభిప్రాయపడ్డ ఆయన, “రాంచందర్ రావు మంచి రైటర్ కావొచ్చు, కానీ ఫైటర్ కాదు” అంటూ వ్యాఖ్యానించారు.రాజాసింగ్ తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

