Putin India Visit: రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నట్టు రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్ అధికారికంగా ప్రకటించింది. భారత ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ ఈ పర్యటన చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ముందస్తుగా రష్యా, భారత్ చేసుకోనున్న సైనిక ఒప్పందాన్ని ఆ దేశ పార్లమెంట్‌లో ఆమోదించనున్నట్టు తెలిసింది.
Putin India Visit: రష్యా అధ్యక్షుడు పుతిన్ 2021లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు భారత్‌లో పర్యటించారు. మళ్లీ ఇప్పుడు పర్యటనకు రానున్నారు. ఇప్పటికి సరిగ్గా నాలుగేళ్ల అనంతరం ఆయన ఈ పర్యటన చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ సందర్భంగా అత్యంత శక్తివంతమైన ఆయుధ సామగ్రిని భారత్‌కు ఇచ్చేందుకు రష్యా ఒప్పందం చేసుకోనున్నట్టు సమాచారం.
Putin India Visit: రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన సందర్భంగా మోదీతో ద్వైపాక్షిక భేటీ జరగనున్నది. ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. పుతిన్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య బలమైన సైనిక సహకారం, వాణిజ్య ఒప్పందాలకు అనుకూల వాతావరణం ఏర్పడనున్నది. అదే విధంగా చైనా ఆగడాలకు చెక్ పెట్టేలా ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Putin India Visit: అదే విధంగా రష్యా ఆర్థిక వ్యవస్థకు నిపుణుల కొరత ఉన్నదని, దానిని భారత్‌తో పూడ్చాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగానే ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, భవన నిర్మాణం, జౌలి రంగాల్లో నిపుణులను రష్యా భర్తీ చేసుకునేందుకు సముఖంగా ఉన్నది. ఈ పర్యటనలోనే భారత్ నుంచి 70 వేల మంది ఆయా రంగాల నిపుణులకు రష్యాలో ఉద్యోగవకాశాలకు ఆమోదం లభించనున్నది.

