Pushpa 2

Pushpa 2: ఓటిటిలో కూడా రికార్డుల రపరప!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ తో చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ పుష్ప 2 సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా 2 వేల కోట్లకు పైగా వసూళ్ళని కొల్లగొట్టింది. రీసెంట్ గా ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. ఈ సినిమా ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇందులో స్ట్రీమ్ అవుతూ పుష్ప 2 ప్రస్తుతం గ్లోబల్ లెవెల్ లో సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. వ్యూస్ పరంగా రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా 58 లక్షలకి పైగా వ్యూస్ రాబట్టింది ఈ సినిమా.

ఇది కూడా చదవండి: Delhi History: ఢిల్లీని 3 రోజుల్లో నాశనం చేశాడు ఓ పాలకుడు.. దానిని తిరిగి గాడిలో పెట్టడానికి వందేళ్లు పట్టింది.. తెలుసుకోవాల్సిన హిస్టరీ ఇది !

ఈ మధ్య కాలంలో ఓ ఇండియన్ సినిమాకి ఓటిటిలో బిగ్గెస్ట్ రికార్డు రెస్పాన్స్ రావడం విశేషం. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నిర్మించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *