Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో యు ముంబా జోరు కొనసాగుతోంది. ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 35-33 తేడాతో యూపీ యోధాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో వెనుకబడ్డ ముంబై.. ఆ తర్వాత గొప్పగా పుంజుకుని గెలుపు వైపు నిలిచింది. అజిత్ 8 పాయింట్లు, రోహిత్ 8 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. యోధాస్ తరపున 11 పాయింట్లతో భరత్ రాణించినా ఫలితం దక్కలేదు. ప్రారంభం నుంచి పాయింట్ల కోసం రెండు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చినా తొలి అర్ధభాగం ముగిసే సరికి యోధాస్ 17-16 ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత రెండు జట్లు పట్టువదలకుండా పోరాడినా ఆఖర్లో ఒత్తిడిని అధిమించి ముంబై జట్టు అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 39-23తో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది.
ఇది కూడా చదవండి: Australia vs Pakistan: కంగారులపై పాక్ సిరీస్ విక్టరీ