Hyderabad: ఫలించని కృషి.. శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు అన్ని పైరసీ

Hyderabad: తెలంగాణలో పైరసీ మాఫియా మరలా రెచ్చిపోయింది. ఇటీవల ఐబొమ్మ సైట్‌ను మూసివేసి, నిర్వాహకుడు ఇంది రవిని అరెస్టు చేసినప్పటికీ సినిమా పైరసీ ఎక్కడా ఆగలేదని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి. “ఆగింది ఐబొమ్మే… పైరసీ కాదు” అన్న మాటను నిజం చేస్తూ, కొత్తగా విడుదలైన సినిమాలన్నీ ఒక్కరోజులోనే పైరసీ సైట్లలో ప్రత్యక్షమయ్యాయి.

శుక్రవారం విడుదలైన 12A రైల్వే కాలనీ, సంతానప్రాప్తిరస్తు, రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమంటే వంటి చిత్రాలు మూవీరూల్జ్ వంటి పైరసీ సైట్లలో అప్‌లోడ్ అయ్యాయి. థియేటర్లలో వీడియో కెమెరాలతో సినిమా రికార్డు చేసి, ఆ రికార్డింగులను సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది.

పైరసీపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా, పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. నిర్మాతలు భారీ నష్టాలను భరిస్తుండగా, పైరసీని పూర్తిగా అరికట్టడంలో ఇంకా విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఐబొమ్మ, బప్పం టీవీ వంటి సైట్లను మూసివేసినప్పటికీ, ముందునుంచే యాక్టివ్‌గా ఉన్న మూవీరూల్జ్ మళ్లీ సినిమాలను వరుసగా లీక్ చేస్తోంది. పైరసీ కారణంగా నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుండటంతో, ప్రభుత్వం మరియు సైబర్ క్రైమ్ శాఖలు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *