Spirit: ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ చిత్రం షూటింగ్ ఈ నవంబర్ చివర్లో ప్రారంభమవుతుందని దర్శకుడు ప్రకటించారు. చిరంజీవి ఈ చిత్రంలో ఉంటారన్న వార్తలను ఆయన ఖండించారు. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Also Read: Sivakarthikeyan: శివకార్తికేయన్‌తో మళ్లీ జోడీ కట్టనున్న శ్రీలీల?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ భారీ అంచనాలు సృష్టించింది. అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌తోనే ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయింది. తాజాగా ‘జిగ్రిస్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్ నవంబర్ చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో భాగమవుతారన్న వార్తలు కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాపై అందరి ద్రుష్టి ఈ షూటింగ్ అప్‌డేట్‌తో మరింత పెరిగింది.

