Poornachandra: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పూర్నాచంద్ర మాధవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆయన, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా నిలుస్తారని, త్వరలోనే ఆయన అరెస్ట్ అవడం ఖాయమని ధీమాగా చెప్పారు. ఈ కేసును సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతుగా పరిశీలిస్తున్నాయని తెలిపారు. జగన్ చేసిన తప్పులను బయటకు చెప్పలేకపోతున్నారని, వాటిని కప్పిపుచ్చేందుకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మాధవ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రజల దృష్టికి రాకుండా చేయడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నా, నిజాలు త్వరలో వెలుగులోకి వస్తాయని అన్నారు. మాధవ్ ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చలు షురూ అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందో అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

