Operation Sindoor: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. ఒక్క రాత్రిలోనే భారత సైన్యం తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్రజలు, ప్రముఖులు, రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
భారత దళాలు మురిడ్కేలో లష్కరే తోయిబా, బహావల్‌పూర్‌లో జైష్-ఎ-మొహమ్మద్, సియాల్కోట్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలపై మెరుపుదాడులు జరిపాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ దిగ్భ్రాంతికి లోనయ్యింది. అమెరికా సహాయాన్ని కోరుతూ ఎదురుపడినట్టు తెలుస్తోంది.
రాజకీయ నేతల స్పందనలు
- నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి: “జైహింద్” అంటూ సైన్యానికి మద్దతు ప్రకటించారు.
- నారా లోకేష్, రాష్ట్ర మంత్రి: “జైహింద్… న్యాయం జరిగింది” అంటూ ట్వీట్ చేశారు.
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు: “జీరో టోలరెన్స్ ఫర్ టెర్రరిజం… భారత్ మాతాకీ జై” అని ట్వీట్ చేశారు.
- కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి: “భారత్ మాతాకీ జై… జైహింద్” అంటూ స్పందించారు.
- బండి సంజయ్, బీజేపీ నేత: “పాక్ మూల్యం చెల్లించక తప్పదు… మేరా భారత్ మహాన్… జైహింద్” అని పేర్కొన్నారు.
- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM అధినేత: “పాకిస్తాన్ మరో పహల్గాం దాడి చేయకుండా గట్టి గుణపాఠం నేర్పించాలి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి” అంటూ ట్వీట్ చేశారు.
Also Read: Operation Sindoor: భారత దాడిలో టాప్ కమాండర్ మృతి.. మసూద్ అజార్, హఫీజ్ సయీద్ లు హతమయ్యారా?
ఈ ఆపరేషన్‌కి సంబంధించి #IndiaPakistanWar అని టాప్‌లో ట్రెండ్ అవుతోంది #OperationSindoor అనే హ్యాష్‌ట్యాగ్‌లు ఎక్స్ (పూర్వంలో ట్విట్టర్)లో టాప్ ట్రెండ్‌గా మారాయి. ప్రజలు సైన్యం పై గర్వంతో స్పందిస్తున్నారు.

