Encounter

Encounter: కొత్త సంవత్సరాన్ని ఎన్‌కౌంటర్‌తో ప్రారంభించిన పోలీసులు

Encounter: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో పోలీసులు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ ఫేజ్-2లో పోలీసులు వెహికిల్ చెకింగ్ చేస్తున్న సమయంలో అర్థరాత్రి ఓ నేరస్థుడితో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఆ దుండగుడు ఆగలేదు. పోలీసులు ఆ దుండగుడిని వెంబడించడంతో వారిపై కాల్పులకు తెగబడ్డాడు.  దీంతో ప్రతీకారంగా పోలీసులు కాల్పులు ప్రారంభించారు. ఆ తర్వాత ఓ బుల్లెట్ దుండగుడి కాళ్లకు తగిలింది. దీంతో అతనికి గాయాలయ్యాయి.

దుండగుడిని వికాస్ అలియాస్ టోయ్‌గా గుర్తించారు. టోయ్ తన సహచరులతో కలిసి మొబైల్ టవర్లలోని విలువైన సామగ్రిని చోరీ చేయడం వంటి ఘటనలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. గ్రేటర్ నోయిడా పోలీసు బృందంలోని కస్నా పోలీస్ స్టేషన్ సోమవారం అర్థరాత్రి సిర్సా రౌండ్‌అబౌట్‌లో తనిఖీ చేస్తోంది. ఇంతలో సైట్-5 పోస్ట్ నుంచి ఓ వ్యక్తి మోటార్ సైకిల్ పై వస్తూ కనిపించాడు. పోలీసు బృందం అతన్ని ఆపమని సూచించింది, కానీ పోలీసు బృందాన్ని చూసిన తర్వాత, బైక్ రైడర్ తన మోటార్ సైకిల్‌ను వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అనుమానం వచ్చిన పోలీసులు నిందితుడిని వెంబడించి చుట్టుముట్టారు. ఈ సమయంలో ఖాన్‌పూర్ గ్రామ సమీపంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి బైక్‌ జారి పడిపోయింది. ఆ తర్వాత పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు దుండగుడు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *