Pushpa 2

Pushpa 2: ‘పుష్ప-2’ నుండి పీలింగ్స్ సాంగ్ ప్రోమో!

Pushpa 2: పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ డిసెంబర్ 5న విడుదల కాబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ బృందం ఇండియా టూర్ ను చేస్తోంది. పాట్నాలో మొదలైన ఈ ప్రమోషనల్ టూర్… చెన్నయ్, కొచ్చి మీదుగా శుక్రవారం ముంబై చేరింది. ముంబైలోనూ మీడియాతో అల్లు అర్జున్ ఇంటరాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలోని ఫోర్ట్ సింగిల్ ప్రోమోను నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ విడుదల చేశారు. ఈ లిరికల్ సాంగ్ వీడియోను డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. ‘ఫీలింగ్స్…’ అంటూ సాగే ఈ పాటలో పల్లవి మలయాళంలో ఉండటం విశేషం. అల్లు అర్జున్ మొదటి నుండి తాను కేరళ దత్తపుత్రుడిని అంటూ ఉంటారు. అందుకోసమే… ఈ పాట లిరిక్స్ ను మలయాళంలో మొదలు పెట్టారని తెలుస్తోంది. శ్రీలీల స్పెషల్ సాంగ్ తర్వాత వస్తున్న ఈ డ్యుయెట్ సైతం ఫుల్ మాస్ అప్పీల్ తో ఉంటుందని దేవిశ్రీ ఇప్పటికే చెన్నయ్ ప్రెస్ మీట్ లో చెప్పేశాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  India: అవినీతి విషయంలో భారత్ ర్యాంకింగ్ ఎంతంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *