Pawan Kalyan: జనసేనాని అసలు పరిచయం అవసరం లేని నాయకుడు. కాకపోతే ఇప్పడంతా డిప్యూటీ సీఎం అంటున్నారు. అందకని కాస్తాంత జనసేనాని పదం వెనకబడింది. ఎన్నెన్నో విమర్శలు, సూటిపోటీ మాటల మద్య జనసేన పార్టీని స్ధాపించారు పవన్ కళ్యాణ్… తొలి నాళ్లలో పార్టీ కూర్పులేకపోవడంతో తనకున్న సిల్వర్ స్క్రీన్ చర్మిషాతో నాడు టీడీపీ, బీజెపీ కూటమిలో భాగస్వామి పక్షంగా చేరి ప్రచారానికి పరిమితమైయ్యారు. కాలక్రమంలో రాజకీయ పరిస్ధితల నేపథ్యంలో 2019లో ఓంటరిగా పోటీ చేసి చేదు అనుభవం ఎదురుచూసారు. రాజోలు అసెంబ్లీలో జనసేన అభ్యర్ధి విజయం సాదించగా… పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లతో పాటుగా అన్నిస్ధానాలలో ఓటమి చవిచూసారు.
ఆ ఓటమితో కుంగిపోలేదు. మరింత రాటుతేలారు. ప్రజా సమస్యలపై పోరాటాలు పెంచారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగళం ఏర్పాటు చేసారు కౌలు రైతులకు భరోసా అందించారు. ఇలా అనేక అంశాలలో ప్రజల పక్షాన నిలబడి 2024లో మరోసారి టీడీపీ ,బీజెపీలతో జతకట్టి బరిలో నిలిచారు అంతే దేశంలోనే తొలిసారిగా 100 శాతం స్ట్రైక్ రేట్‌తో నిలబడిన ప్రతీ స్ధానంలో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఐదు ప్రభుత్వశాఖలకు మంత్రిగా పరిపాలనలో అడుగుపెట్టారు. రాజకీయ దురంధరుడు, పరిపాలన దక్షకుడు సీఎం చంద్రబాబు క్యాబినెట్‌లో ఉంటూ పరిపాలనపై అనుభవం సంపాదిస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా మీడియాతో చిట్ చాట్ చేశారు. దాదాపు 3 గంటల సేపు సాగిన ఈ చిట్ చాట్‌లో పవన్ కళ్యాణ్ అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఆఫీసులో కుర్చుని అడ్మినిస్ట్రేషన్ చేయడం నేర్చుకున్నాను కానీ ప్రజల మధ్యకి వేళ్లితే కరెక్ట్ అనే భావనతో పవన్ జిల్లాల పర్యటనకు నిర్ణయించుకున్నారు. ప్రతీ నెలలో 14 రోజులు జిల్లాల్లో ఉండాలని డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించి సాధ్యాసాధ్యాలతో పాటుగా పరిస్ధితులపై కసరత్తు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.
శని, ఆదివారాలు సెలవులను పరిగణలోకి పెట్టకుని ప్రజల మధ్యకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారం వెతకాలంటే ప్రజల మధ్య ఉండాలనేది పవన్ రూల్‌గా చెపుతున్నారు. జగన్ పరిపాలనలో అధికారులు పని మర్చిపోయారని, వర్క్ క్వాలిటీ కూడా వదిలేసారని అసలు అధికారులను సైతం మళ్లీ పని వైపు తీసుకురావాల్సిన అవసరం ఉందని పవన్ అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఆరునెలల పరిపాలన… కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఆరునెలల పరిపాలన బేరీజు వేసుకోవాలని పవన్ కోరుతున్నారు.
జనసేన పార్టీపైనా పవన్ దృష్టి సారించనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి మొన్నటి ఎన్నికల వరకు కష్టపడిన నేతలందరికీ జనసేనలో తగిన ప్రాధాన్యం ఉంటుందని పవన్ తెలిపారు. ఇప్పటికే పవన్‌కు సన్నిహితులుగా ఉన్న అందరి నేతలకు క్రియాశీలక పదవులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కులమతాలకు ప్రాంతాలకు మధ్య సంబంధం లేకుండా పదవులు కేటాయించామని పవన్ తెలిపారు. అందులో ఎమ్మెల్సీగా ఎన్నికైన హరి ప్రసాద్‌తో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న విజయ్ కుమార్ లాంటి వ్యక్తులు ఉన్నారని పవన్ గుర్తు చేశారు. కొత్త సంవత్సరం తొలి నెల తొలి వారంలో పవన్ క్యాడర్ పార్టీ బలోపేతంపై దృష్టి సాధించనున్నారు.
మార్చి 14న జరగబోతున్న జనసేన ఆవిర్భావ సభ వరకు పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉండునట్లు తెలియజేశారు. ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసి ముఖ్య నాయకులకు పవన్ దిశా నిర్దేశం చేశారు. ఇక పూర్తిస్థాయిలో జిల్లా స్థాయి కేడర్ నియోజకవర్గ గ్రామ స్థాయి కేడర్ వరకు బలోపేతంపై దృష్టి సాధించనున్నారు. ఎన్నికల సమయంలో జనసేన క్యాడర్ పార్టీకి సేవ చేసిన వారు అనేకమంది ఉన్నారని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను కలవడానికి తన వెళ్ళిన ప్రాంతాలకు నాయకులు వచ్చిన కలవలేకపోతున్నానని జనవరి మొదటి వారం నుంచి చేపట్టే ఈ ప్రణాళికతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి పనిచేసిన క్యాడర్‌ను కలవడం పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సాధిస్తానని తెలియజేశారు.
ఇటు రాజకీయాలలో తనదైన శైలిలో దూసుకెళ్తూ పనిని పరుగులు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్ అటు సినిమాలు కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. ఇప్పటికి మూడు సినిమాలు కమిట్మెంట్ ఉన్న పవన్ మూడు సినిమాలు దాదాపుగా పూర్తి కావచ్చు అని తెలిపారు. ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా ఓజి, ఓజి అంటూ నినాదాలు చేస్తూ ఉంటున్నారని ఓజి దాదాపుగా పూర్తవు వచ్చిందని హరిహర వీరమల్లు, ముస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సైతం పూర్తికా వచ్చినట్లు పవన్ తెలిపారు. మొత్తానికి అటు రాజకీయాన్ని ఇటు సినిమాని బ్యాలెన్స్ చేస్తూ పవన్ పొలిటికల్ గేమ్ చేంజర్‌గా మారారు.
రాసినవారు: మురళీ మోహన్
ఏపీ బ్యూరో చీఫ్
అమరావతి