Pahalgam Terror Attack: భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ ప్రపంచంలో పాకిస్థాన్ ఏకాకిగా మారింది. తనకు గతంలో దన్నుగా నిలిచిన అమెరికా, చైనా సహా అన్ని దేశాలు భారత్‌కు మద్దతివ్వకపోయినా పాకిస్తాన్‌కు మాత్రం మద్దతును ఇవ్వడం లేదు. పాకిస్తాన్ చర్యలనే తప్పుబడుతున్నాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందేనని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీ-7 దేశాలు కూడా కీలక ప్రకటనను విడుదల చేశాయి.
Pahalgam Terror Attack: జీ-7 కూటమిలోని అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఉమ్మటి ప్రకటనను విడుదల చేశాయి. ప్రపంచంలోనే సూపర్ పవర్ కంట్రీస్ అయినా ఆయా దేశాలు ఉమ్మడిగా పాకిస్థాన్ తీరును తప్పుబట్టాయి. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి కారణంగా పాకిస్థాన్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారియంది. తొలుత ఉగ్రస్థావరాలపైనే భారత్ దాడులకు దిగింది. దీన్ని ఆసరా చేసుకున్న పాక్.. భారత్ లోని జనావాసాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడుతున్నది. అయితే ఆ దాడులను భారత్ చాకచక్యంగా తిప్పికొడుతున్నది.
Pahalgam Terror Attack: ఈ దశలో పహల్గాం దాడిని జీ-7 దేశాలు ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఖండించాయి. పాకిస్థాన్ తీరు సరిగా లేదంటూ పేర్కొన్నాయి. ఉగ్రవాద నిర్మూలన చర్యలకు ఎలాంటి చర్యలకు పాక్ తీసుకోకపోవడాన్ని ఆయా దేశాలు తప్పుబట్టాయి. కనీసం ఉగ్రదాడిపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంపైనా మండిపడ్డాయి. ఇదే ధోరణిని పాక్ ప్రదర్శిస్తే మున్ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జీ-7 దేశాలు హెచ్చరించాయి.
Pahalgam Terror Attack: పాక్‌ను ఆక్షేపించిన జీ-7 దేశాలు.. భారత్‌కు మద్దతుగా నిలిచినట్టయింది. ఇరుదేశాలు ద్వైపాక్షిక సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించాయి. ఇదే విధంగా కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటుందని హెచ్చరించాయి. శాంతియుత వాతావరణం తెచ్చేందుకు ఇరు దేశాలు చొరవ చూపాలని సూచించాయి.