P Ravi Shankar

P Ravi Shankar: గాత్రంతో రవిశంకర్ మాయ!

P Ravi Shankar: ‘బొమ్మాళీ నిన్నొదల…’ అంటూ ఈ నాటికీ బాలలు సైతం అంటూ ఉంటారు… అంతలా ‘అరుంధతి’ సినిమాలో సోనూ సూద్ నటనకు తగ్గ వాచకం పలికించారు రవిశంకర్… అసలు రవిశంకర్ కుటుంబంలోనే గాత్రంతో మాయ చేసే గుణం ఉందని చెప్పవచ్చు… ఆయన తండ్రి నటుడు, డబ్బింగ్ కళాకారుడు పి.జె.శర్మ తన గళంతో ఎంతోమంది పరభాషా నటులను తెలుగువారికి చేరువ చేశారు…ఇక రవి అన్నయ్య సాయికుమార్ ‘డబ్బింగ్ కింగ్’ అనిపించుకున్నారు… వారి బాటలోనే పయనిస్తూ రవశంకర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అదరహో అనిపించారు… ఆ పై నటనతోనూ దుష్టపాత్రల్లో బెదరగొట్టారు… కన్నడ నాట కూడా తనదైన బాణీ పలికించారు రవిశంకర్… నవంబర్ 28న రవిశంకర్ పుట్టినరోజు… గళంతోనూ, అభినయంతోనూ ఆకట్టుకుంటున్న రవిశంకర్ రాబోయే రోజుల్లో ఇంకా ఏ తీరున సాగుతారో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *