Nirmal district: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల చిరుత పులులు గ్రామాలపైకి వస్తున్నాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన క్రూరమృ గాలు గ్రామాలపై బడి, పంట చేలల్లో తిరిగాడుతున్నాయి. ఇటీవల పలుచోట్ల ప్రజలపై పులులు దాడులు చేసిన ఘటనలూ చోటుచేసుకున్నాయి. వరంగల్, నాగర్‌కర్నూలు జిల్లాల్లో పులులు సంచరిస్తున్నాయన్న సమాచారాన్ని మరువకముందే నిర్మల్ జిల్లాలో మరో చిరుత కలకలం రేపింది.
Nirmal district: ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో అర్ధరాత్రి హైవేపై తిరుగుతున్న పులి వాహనదారుల కంటపడింది. ఆ జిల్లాలోని దిలావర్‌పూర్ మండలంలో అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై ఈ చిరుతపులి కనిపించింది. దీంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనలో ఉన్నారు. పులి సంచిరిస్తున్న విషయాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేశారు.