Nara lokesh: 70 వేల కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న మోదీ..

Nara lokesh: ప్రధాని మోదీ విశాఖకు కొన్ని కీలక ప్రాజెక్టుల శంకుస్థాపన కోసమే వస్తున్నారని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ 8వ తేదీన విశాఖపట్నం పర్యటనకు రాబోతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు విశాఖలో సమీక్ష నిర్వహించారు. పర్యటన ఏర్పాట్లను స్వయంగా లోకేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,

ప్రధాని మోదీ తన పర్యటనలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, ₹70,000 కోట్ల విలువైన NTPC గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, విశాఖ-చెన్నై ఆర్థిక కారిడార్‌లో కృష్ణపట్నం వద్ద ముఖ్యమైన ప్రాజెక్టుల శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే, ₹3,900 కోట్లతో చేపట్టిన రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం కూడా చేస్తారని వివరించారు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనందరి కల అయిన విశాఖ రైల్వేజోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని లోకేశ్ వెల్లడించారు. గత ప్రభుత్వం రైల్వే జోన్ కోసం కనీసం భూమి కూడా కేటాయించలేదని, దీంతో రైల్వే జోన్ నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం భూమిని కేటాయించడంతో, రైల్వే జోన్ భవన నిర్మాణాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

ఈ పర్యటనలో, ప్రధాని మోదీ పలు రైల్వే అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఎన్నికలలో ఎన్డీఏ విజయానంతరం, ప్రధాని మోదీ విశాఖకు వస్తున్నందున, ఆయనను ఘనంగా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రాష్ట్రాన్ని తిరిగి సక్రమ మార్గంలో పెట్టేందుకు కట్టుబడినట్లు, గత వైసీపీ ప్రభుత్వం ఒక “ఫేక్” ప్రభుత్వం అని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని, అభివృద్ధి చేయకుండా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని నిర్లక్ష్యంగా వదిలేసినట్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖలో టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలను తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని లోకేశ్ స్పష్టం చేశారు. అలాగే, విశాఖ విమానాశ్రయానికి భూసేకరణ చేయడంలో కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వమే కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు.

రుషికొండ ప్యాలెస్ ప్రాజెక్టుకు సంబంధించి, ఒక వ్యక్తి కోసం ₹1000 కోట్ల వృథా చేశారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఉన్న కంపెనీలన్నింటినీ తరిమేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూగుల్, టీసీఎస్ వంటి పెద్ద సంస్థలు ఏపీలోకి రావడం జరుగుతుందని చెప్పారు.

వాలంటీర్లకు సంబంధించిన గత ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని లోకేశ్ తెలిపారు. ఎన్నికల సమయంలో 80% మంది వాలంటీర్లను ఉపయోగించి, జగన్ రాజీనామా చేయించారని ఆయన వెల్లడించారు.

ALSO READ  Telugu news: తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య‌గాలులు.. పెరిగిన చ‌లి తీవ్ర‌త‌

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *