Naga Vamsi: టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ గత కొన్ని చిత్రాలతో వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ ఎదురైంది. ఇప్పుడు ఆయన కొత్త చిత్రం ‘ఎపిక్’ ప్రకటన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో తన సినిమాలతో అందరికీ బదులిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Ajay Devgn: హైదరాబాద్‌లో అజయ్ దేవగణ్ ఫిల్మ్‌సిటీ.. ఏ తరహాలో ఉంటుందో తెలుసా?
ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఇటీవలి కాలంలో వరుసగా నష్టాలు మూటగట్టుకున్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ బాగా పెరిగింది. అయితే ఈసారి ఆయన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీతో దర్శకుడు ఆదిత్య హాసన్ డైరెక్షన్లో పక్కా లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎపిక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ ప్రకటన సందర్భంగా నాగ వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026లో తాను నిర్మించే సినిమాలతో తనపై విమర్శలు చేసిన వారందరికీ సమాధానం చెబుతానని, ఎవరికీ కామెంట్ చేసే అవకాశం ఇవ్వనని, ట్రోలర్లను కూడా పూర్తిగా సైలెంట్ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

