Naga Shaurya: యంగ్ హీరో నాగాశౌర్య శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో రామ్ దేశిన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీనిని శ్రీనివాస్ చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. ప్రస్తుతం యాక్షన్ పార్ట్ ను దర్శకుడు రామ్ తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ కు ఇది కమ్ బ్యాక్ మూవీ. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. గత యేడాది నాగశౌర్య నటించిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’, ‘రంగబలి’ చిత్రాలు విడుదల కాగా రెండూ తీవ్ర నిరాశకు గురిచేశాయి. మరి ఈ కొత్త సినిమా అయినా ఈ యంగ్ హీరోను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.