Naga Chaitanya

Naga Chaitanya: సీరీస్ తో నాగచైతన్య బిజీ బిజీ!

Naga Chaitanya: ఇటీవల శోభిత ధూళిపాళను వివాహమాడిన నాగచైతన్య కెరీర్ పరంగానూ దూకుడు మీద ఉన్నాడు. అటు నాగార్జునతో పాటు అఖిల్ కూడా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వని తరుణంలో నాగచైతన్య మాత్రం సినిమాలతో పాటు వెబ్ సీరీస్ తో కూడా బిజీగా ఉన్నాడు. బిగ్ బాస్ 8 కంప్లీట్ చేసిన నాగార్జున ధనుష్ తో కలసి ‘కుబేర’ సినిమాతో మరో మల్టీ స్టారర్ మాత్రమే చేస్తున్నాడు. నాగచైతన్య నటించిన ‘తండేల్’ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. దీని తర్వాత ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు తో ఓ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడు.

ఇది కూడా చుడండి: Cyber Criminals: ఆన్‌లైన్‌లో ఆడుకుంటున్నారా? సైబర్ దొంగలు మీతో గేమ్స్ ఆడేస్తారు.. జాగ్రత్త!

Naga Chaitanya: ఇదిలా ఉంటే గతంలో ‘ధూత’ వెబ్ సీరీల్ లో నటించిన నాగచైతన్య ఇప్పుడు ‘ధూత2’ చేయబోతున్నాడు. దీనిని అమెజాన్ ప్రైమ్ నిర్మించనుంది. ఇది కాకుండా ‘బాహుబలి’ నిర్మాతలు ఆర్కా మీడియా అధినేతలు కూడా నాగచైతన్యతో ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా థ్రిల్లర్ నేపథ్యంలోనే రానుంది. మరి దూకుడు మీద సినిమాలతో పాటు సీరీస్ పై సీరీస్ చేస్తున్న నాగచైతన్య వాటితో ఎలాంటి విజయాలు అందుకుంటాడో చూద్దాం.

తౌబా తౌబా’ సాంగ్ కు ఆశా స్టెప్!?

Aasha: ఈ ఏడాది విడుదలైన ‘బ్యాడ్ న్యూజ్’ సినిమాలోని ‘తౌబా తౌబా…’ సాంగ్ అనూహ్యమైన ప్రజాదరణను పొందింది. ఈ పాట కోసమే విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమాను పదే పదే చూసినవారున్నారు. ఇక రీల్స్ లోనూ ఈ పాటకు స్టెప్ వేయని వారు లేరు. తాజాగా 91 సంవత్సరాల దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్, లెజెండరీ గాయని ఆశా భోంస్లే కూడా ఈ పాటకు హుక్ స్టెప్ వేసి అలరించారు. దుబాయ్ లో ఓ ఈవెంట్ లో కరణ్ ఔజ్లా కంపోజ్ చేసి పాడిన ‘తౌబా తౌబా’ పాటను పాడటమే కాదు స్టేజ్ పైన స్టెప్ కూడా వేశారు. క్షణాల్లోనే ఆశాభోంస్లే వేసిన ఈ స్టెప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేశారు అభిమానులు. మరి ఈ లెజెండరీ గాయని స్టెప్ పై హీరో విక్కీ కౌశల్ స్పందన ఏమిటో తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KA 2 Movie: 'క -2' రెండు సినిమాల తర్వాతే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *