Mobiles Theft: ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళుతున్న కంటైనర్ వాహనంలో రూ.3 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు మాయం అయిపోయాయి. ఢిల్లీకి చెందిన చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ రూ.3 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను కంటైనర్ వాహనంలో బెంగళూరుకు పంపించింది. ఈ నెల 22న కంటైనర్ ట్రక్ ఢిల్లీ నుంచి బయలుదేరింది. కానీ, బెంగళూరు చేరుకోలేదు.
అనుమానం వచ్చిన చైనా కంపెనీ అధికారులు కంటైనర్‌కు అమర్చిన జీపీఎస్ ద్వారా ట్రాక్ చేశారు. చిక్కబళ్లాపూర్ రెడ్డి కొల్లారహళ్లి సమీపంలో కంటైనర్ పార్క్ అయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో కంపెనీ ప్రతినిధులు కొల్లారహళ్లి వద్ద కంటైనర్ ట్రక్ ఉన్న ప్రదేశానికి వచ్చి చూశేసరికి కంటైనర్ ఖాళీగా ఉంది. మొబైల్ ఫోన్లు మాయం అయిపోయాయి.
Mobiles Theft: ‘ఛీప్ స్పీడ్ క్యారియర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ మొబైల్ ఫోన్‌లను ఢిల్లీ నుంచి బెంగళూరు రవాణా చేస్తోంది. ఈ కంపెనీలో రాహుల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కంటెయినర్‌లో మొబైల్ ఫోన్లు లోడ్ చేసుకుని బెంగళూరుకు బయలుదేరాడు. ఇప్పుడు రాహుల్ తో పాటు మూడు కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు కనిపించకుండా పోయాయి.
మొబైల్ ఫోన్ల చోరీపై చైనా కంపెనీ అధికారులు చిక్కబళ్లాపూర్‌లోని పారేచంద్ర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డ్రైవర్ రాహుల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.