Nara Lokesh

Nara Lokesh: గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా డిమాండ్ పై స్పందించిన మంత్రి లోకేశ్

Nara Lokesh: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి, పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించారు.

సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ సజావుగా కొనసాగేందుకు అన్ని కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. రోస్టర్ లో తప్పులు సరిచేసిన తర్వాత మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Maha Kumbhamela 2025: మూడువేల కిలోమీటర్లు.. పాతికేళ్ల క్రితం బైక్.. మహాకుంభమేళాకు తండ్రీకొడుకుల ప్రయాణం!

గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్‌లో, అభ్యర్థుల సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నామని తెలిపారు. పరీక్ష వాయిదాపై లీగల్ టీమ్‌తో సంప్రదింపులు జరిపి, త్వరలోనే సరైన పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, అభ్యర్థులు సంయమనం పాటించాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *