Hitler: చిరంజీవి కెరీర్ లో గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ‘హిట్లర్’. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను న్యూ ఇయర్ లో రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎడిటర్ మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో రంభ, రాజేంద్రప్రసాద్, దాసరి నారాయణరావు, అశ్వని, మోహిని, మీనాకుమారి, గాయత్రి, బ్రహ్మానందం ముఖ్య పాత్రరలు పోషించారు. రాజ్ కోటి సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా సెన్సేషనల్ హిట్ అయింది. ఈ జనవరి 1న రీరిలీజ్ కావలసిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల సినిమా రీరిలీజ్ వాయిదా వేస్తున్నామన్నారు మేకర్స్. క్వాలిటీ పరంగా అభిమానులకు మెరుగైన అనుభూతి ఇవ్వాలనే ప్రయత్నంలో వాయిదా వేశామన్నారు. రీరిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. మరి అప్పట్లో ఘన విజయం సాధించిన ‘హిట్లర్’ రీరిలీజ్ లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూద్దాం.
ఇది కూడా చదవండి: Sankranthiki Vasthunnam: వెంకటేష్ మాములుగా పాడలేదుగా.. మరో సాంగ్ రిలీజ్
Naga Chaitanya: సీరీస్ తో నాగచైతన్య బిజీ బిజీ!
Naga Chaitanya: ఇటీవల శోభిత ధూళిపాళను వివాహమాడిన నాగచైతన్య కెరీర్ పరంగానూ దూకుడు మీద ఉన్నాడు. అటు నాగార్జునతో పాటు అఖిల్ కూడా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వని తరుణంలో నాగచైతన్య మాత్రం సినిమాలతో పాటు వెబ్ సీరీస్ తో కూడా బిజీగా ఉన్నాడు. బిగ్ బాస్ 8 కంప్లీట్ చేసిన నాగార్జున ధనుష్ తో కలసి ‘కుబేర’ సినిమాతో మరో మల్టీ స్టారర్ మాత్రమే చేస్తున్నాడు. నాగచైతన్య నటించిన ‘తండేల్’ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. దీని తర్వాత ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు తో ఓ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడు.
Naga Chaitanya: ఇదిలా ఉంటే గతంలో ‘ధూత’ వెబ్ సీరీల్ లో నటించిన నాగచైతన్య ఇప్పుడు ‘ధూత2’ చేయబోతున్నాడు. దీనిని అమెజాన్ ప్రైమ్ నిర్మించనుంది. ఇది కాకుండా ‘బాహుబలి’ నిర్మాతలు ఆర్కా మీడియా అధినేతలు కూడా నాగచైతన్యతో ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా థ్రిల్లర్ నేపథ్యంలోనే రానుంది. మరి దూకుడు మీద సినిమాలతో పాటు సీరీస్ పై సీరీస్ చేస్తున్న నాగచైతన్య వాటితో ఎలాంటి విజయాలు అందుకుంటాడో చూద్దాం.