Manmohan Singh: మాజీ ప్రధాని దివంగత మన్మోహన్‌సింగ్ చితాభస్మాన్ని యమునా నదిలో ఆయన సభ్యులు కలిపారు. గురుద్వారా మజ్ను కాతిల్లా వద్ద యమునా నదిలో ఆయన చితాభస్మాన్ని కలిపారు. ఇప్పటికే మన్మోహన్‌సింగ్ మృతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్నాయి. ఆయన సేవలను దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, వివిధ రంగాల ప్రముఖులు కొనియాడుతున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. దేశానికి విశిష్ట సేవలందించిన మన్మోహన్‌కు భారతరత్న బిరుదు ఇవ్వాలన్న వినతులు వస్తున్నాయి.
