Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన దగ్గర నుంచీ ప్రతి విషయంలోనూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ఎదో వివాదం రేగుతూనే ఉంది. అంత్యక్రియల స్థలం మొదలుకుని స్మారక చిహ్నం వరకూ పార్టీ అంశంలోనూ కాంగ్రెస్ అభ్యంతరాలు రేకెత్తిస్తోంది. దానికి బీజేపీ గట్టిగా కౌంటర్లు ఇస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా డాక్టర్ మన్మోహన్ సింగ్ చితాభస్మ నిమజ్జనానికి కాంగ్రెస్ లేదా గాంధీ కుటుంబానికి చెందిన నాయకులెవరూ హాజరుకాలేదని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తన ఎక్స్ పోస్ట్ లో ‘మాజీ ప్రధాని మృతికి దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తున్నప్పుడు, రాహుల్ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వియత్నాం వెళ్లారు. ‘ అంటూ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా మాట్లాడుతూ, ‘కుటుంబ గోప్యతను దృష్టిలో ఉంచుకుని, అస్థికల నిమజ్జనంలో కాంగ్రెస్ నేతలెవరూ పాల్గొనలేదు.’ అని సమాధానమిచ్చారు.
ఇది కూడా చదవండి: Pune Pub: ఏమండీ ఇది విన్నారా? పబ్బుకు రండి.. కండోమ్ తీసుకోండి..
Manmohan Singh: ఇదిలా ఉండగా ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ కోసం ప్రత్యేక స్మారక చిహ్నం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది, దీనిని హోం మంత్రిత్వ శాఖ ఆమోదించింది అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఢిల్లీలో ఏక్తా స్థల్ ఉంది. ఇక్కడ, 9 ప్రదేశాల్లో 7 చోట్ల మాజీ ప్రధాని, మాజీ రాష్ట్రపతి స్మారక చిహ్నాలు నిర్మించారు. ఇంకా 2 స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి సమయం పడుతుంది అని ఆయన వివరించారు. దీనికోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ట్రస్ట్ మాత్రమే స్మారకాన్ని నిర్మిస్తుంది. వాజ్‌పేయి హయాంలో కూడా అదే జరిగింది అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.