Manish Sisodia: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా సోమవారం ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారా ప్రజల ఆర్థిక సహాయాన్ని అభ్యర్థిస్తూ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే, జంగ్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.
సిసోడియా గతంలో 2015 నుంచి పట్‌పర్‌గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి, జంగ్‌పుర నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా, క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రజల మద్దతును పొందాలని నిర్ణయించారు.
“నేను ఎన్నికల్లో పోటీ చేసి విజయాలు సాధించడానికి ప్రజలే కారణం. వారి ఆర్థిక సహకారం వల్లే ఎన్నోసార్లు విజయం సాధించగలిగాను. ఈసారి కూడా మీ సహకారం అవసరం” అని అన్నారు. ప్రజల సహకారం ద్వారా తన ఎన్నికల వ్యయం నెరవేర్చుకోవాలని సిసోడియా కోరారు.