Mahesh Babu: ‘కల్కి’ విడుదలకు ముందు, అలాగే ‘దేవకి నందన వాసుదేవ’ సినిమాలో కృష్ణుడుగా మహేశ్ బాబు కనిపిస్తారంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఫ్యాన్స్ ఏకంగా మహేశ్ ను కృష్ణుడు గెటప్ లో ఊహించుకుంటూ పలు పిక్స్ ని షేర్ చేశారు. అయితే నాగ్ అశ్విన్ ‘కల్కి’లో కృష్ణుడి ముఖాన్ని చూపించటానికి ఇష్టపడలేదు. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన అశ్విన్ మహేశ్ దేవుడిగా ఫుల్ లెంగ్త్ రోల్ చేయటానికి సరిగ్గా సరిపోతాడని కామెంట్ చేశాడు.
ఇది కూడా చదవండి: Karimnagar: కరీంనగర్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు
Mahesh Babu: ‘ఖలేజా’లో మహేశ్ పోషించిన దేవుడు కాని మనిషి పాత్రని తాను ఎంతగానో ఇష్టపడతానని కూడా అన్నాడు. ‘హనుమాన్’తో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ సైతం ‘జై హనుమాన్’లో శ్రీరాముని పాత్రకి మహేశ్ సరిగ్గా సరిపోతాడని అన్నాడు. బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛబ్రా కూడా మహేశ్ బాడీ లాంగ్వేజ్, ఫేస్ శ్రీకృష్ణుడి పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతుందని తెలిపాడు. అందుకే మహేశ్ ఫాన్స్ కూడా తమ హీరో పౌరాణిక చిత్రంలో మహేశ్ ఏదో ఒక దేవుడి పాత్రలో కనిపిస్తే చూడాలని తపిస్తున్నారు. మరి వారి కోరికను మహేశ్ ఎప్పుడు నెరవేరుస్తాడో చూడాలి.
అక్కినేనిని కొనియాడిన మోదీ!
ANR: ఇటీవలే లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి పూర్తయింది. నిర్మాతగా, స్టూడియో ఓనర్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన అక్కినేని గురించి ప్రధాని మోడి ‘మన్ కీ బాత్’ 117వ ఎపిసోడ్ లో ప్రశంసించారు. ఈ ఎపిసోడ్ లో మాట్లాడిన మోదీ తెలుగు సినిమాకు అక్కినేని చేసిన సేవలను కొనియాడారు. సంప్రదాయాలు, విలువలు పాటిస్తూ తెలుగు సినిమా ఎదగటానికి అక్కినేని కృషి చేశారన్నారు. దేశవ్యాప్తంగా అక్కినేని శతజయంతి సంవత్సరాన్ని జరుపుకున్న సందర్భంగా ఆయనను అభినందించటానికి మోదీ కొంత సమయాన్ని వెచ్చించారు.
ANR: గతేడాది శతజయంతి పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ గురించి మన్ కి బాత్ ఎపిసోడ్ లో ప్రస్తావించిన మోదీ, ఈ ఏడాది అక్కినేనిత పాటు బాలీవుడ్ ప్రముఖులు తపన్ సిన్హా, రాజ్ కపూర్ ను కూడా ప్రశంసిస్తూ వారు భారతీయ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందటంలో ఎంతగానో దోహదపడ్డారన్నారు. మన్ కి బాత్ తో అక్కినేని ప్రస్తావనపై మోదీకి అక్కినేని నాగార్జున కృతజ్ఞతలు తెలియచేశారు.