Kurnool

Kurnool: కందనవోలు ముంగిట 2024 రాజకీయ ముఖచిత్రం

Kurnool: గేట్​ వే ఆఫ్ రాయలసీమగా పేరొందిన కర్నూలు రాజకీయాలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. 1983 ఎన్నికల్లో అప్పటి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు ప్రజల్లో ఉన్న అభిమానంతో భారీ విజయం అందుకున్నారు. ఆ తరువాత 40 ఏళ్లకు అంతకంటే భారీ విజయం టీడీపీకి అందించిన సంవత్సరం ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలకుగాను 11 సీట్లలో విజయ కేతనం ఎగుర వేయగా… ఎట్టకేలకు ఆదోనిలో విజయం అందుకొని బీజేపీ ఖాతా తెరిచింది ఉమ్మడి జిల్లా నుంచి టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కర్నూలు, నంద్యాల ఎంపీలతోపాటు ఏడుగురు కొత్త ఎమ్మెల్యేలను తొలిసారిగా చట్టసభలకు పంపిన ఘనత ఈ ఏడాది దే…

ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఎంపీ స్థానాలు సహా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో కర్నూలు జిల్లాలో టీడీపీ ప్రభంజనం సృష్టించి.. అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ టీడీపీ ఆ స్థాయిలో విజయం అందుకోలేదు. మళ్ళీ ఇపుడు 40 ఏళ్ల తరువాత ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలో కూటమి విజయం అందుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం అందుకుంది. ఓటమి చెందిన రెండు నియోజకవర్గాల్లో మంత్రాలయం, ఆలూరులో కేవలం 2 వేల పైచికులు ఓట్ల తేడాతో ఓడిపోయింది. కర్నూలు, నంద్యాల ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరితో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు టీజీ భరత్, బొగ్గుల దస్తగిరి, కేఈ శ్యాంబాబు, డాక్టర్ పార్థసారథి, కోట్ల జయ సూర్య ప్రకాశ్‌ రెడ్డి, గిత్తా జయసూర్య, బి.విరూపాక్షిలు తొలిసారిగా అసెంబ్లీకి పరిచయం అయ్యారు. కూటమి ప్రభుత్వంలో టీజీ భరత్, బీసీ జనార్థన్‌ రెడ్డిలు తొలిసారి చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు.

2019లో జరిగిన ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి క్లీన్‌ సీప్ చేసిన వైసీపీకి 2024ముంగిట చేదు జ్ఞాపకమే మిగిలింది. కలలో కూడా ఉహించని ఘోర పరాజయం ఇచ్చి భారీ దెబ్బకొట్టింది. నంద్యాల జిల్లాలో అన్ని స్థానాల్లో ఓటమి చెందితే… కర్నూలు జిల్లాలో ఆలూరు, మంత్రాలయం స్థానాలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే రాబోయే ఏ ఎన్నికల్లో అయిన సరే వైసీపీ నాయకులకు గుర్తుండే ఏడాది ఇది. జగన్ సిద్దం సభలతో ప్రజల వద్దకు వచ్చినా.. ఉమ్మడి కర్నూలు జిల్లా ఓటర్లు మాత్రం అదరించలేకపోయారు.ఇక 2024 రాజకీయ చిత్రాలెన్నోజరిగాయి. నంద్యాలలో 2023 సెప్టెంబరు 8న టీడీపీ అధినేత చంద్రబాబును నాటి జగన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 2024 ఎన్నికల్లో నంద్యాల జిల్లాలో వైసీపీకి ఒక్క స్థానం కూడా ఇవ్వకుండా కూటమి క్లీన్‌ సీప్ చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో ప్రజావేదిక సభలో పాల్గొన్నారు.
స్పాట్

ALSO READ  దేవరగట్టు సమరం..100 మందికి గాయాలు

ఇక ఎన్నికల ఏడాదిలో కూడా ప్రజా సమస్యలపై సీపీఐ, సీపీఎం సహా వామపక్ష పార్టీలు పలు ఉద్యమాలను కొనసాగించారు. అలాగే కర్నూలు ఎంపీగా నాలుగు సార్లు విజయం సాధించి, కేంద్ర మంత్రిగా పని చేసిన కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి డోన్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో మూడు దశల్లో సాగునీటి సంఘాల ఎన్నికల్లో భాగంగా డబ్ల్యూయూఏ, డీసీ, ప్రాజెక్టు ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం విశేషం… ఉద్యోగానికి రాజీనామా చేసి కర్నూల్‌ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఘోరంగా ఓటమి చెందారు. ఆ తరువాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇపుడు రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

రాసినవారు: ఖలీల్
సీనియర్ కరస్పాండెంట్
కర్నూలు జిల్లా

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *