Kumbh Mela:

Kumbh Mela: మ‌హా కుంభ‌మేళాకు భారీ ఏర్పాట్లు.. విశేష ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

Kumbh Mela: మ‌హా కుంభ‌మేళాకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌యోగ‌రాజ్ సిద్ధ‌మ‌వుతున్న‌ది. 2025 జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు 45 రోజుల పాటు పెద్ద ఎత్తున ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఉత్స‌వాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది వ‌స్తార‌ని అంచ‌నా. దీంతో సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. ప్ర‌ధాన మంత్రి మోదీ సైతం త‌న మ‌న్‌కీ బాత్‌లో ఈ మ‌హా కుంభ‌మేళాను ప్రస్తావించ‌డం గ‌మ‌నార్హం. దీనిని ఐక్య‌తా మేళాగా పేర్కొన్నారు.

ఈ మ‌హా కుంభ‌మేళాకు ప్ర‌త్యేక‌త‌లు ఇవే..
– భ‌క్తుల‌కు తాత్కాలిక వ‌స‌తి క‌ల్ప‌న‌కు వేలాది టెంట్లు, షెల్ట‌ర్ల‌తో మ‌హా కుంభ‌న‌గ‌ర్ ఏర్పాటు. దీనికి గూగుల్ మ్యాప్ అనుసంధానం.
– దేశ సాంస్కృతిక, వార‌స‌త్వ వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు క‌ళాగ్రామ్ ఏర్పాటు
– రోడ్ల పున‌ర్నిర్మాణం. 17 ప్ర‌ధాన ర‌హ‌దారుల సుంద‌రీక‌ణ ప‌నులు. 30 తేలియాడే వంతెన (పొంటూన్ బ్రిడ్జీ)లు నిర్మాణం
– అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌రిగితే స‌కాలంలో స్పందించేలా ప‌క‌డ్బందీ ఏర్పాట్లు. అత్యాధునిక బ‌హుళ‌-విప‌త్తు ప్ర‌తిస్పంద‌న వాహ‌నాల మోహ‌రింపు
– మార్గ‌నిర్దేశం చేసేందుకు ఇంగ్లిష్‌, హిందీ స‌హా ప‌లు ప్రాంతీయ భాష‌ల్లో 800 బోర్డుల ఏర్పాటు
– భ‌ద్ర‌త కోసం పారా మిలిట‌రీ బ‌ల‌గాలు స‌హా 50 వేల మంది పోలీసుల మోహ‌రింపు
– పోలీస్ స్టేష‌న్ల‌లో సైబ‌ర్ హెల్ప్‌డెస్క్‌, అందుబాటులో 56 మంది సైబ‌ర్ వారియ‌ర్ల బృందం
– కృత్రిమ మేధ సాంకేతిక‌త‌తో కూడిన 2,700 కెమెరాల ఏర్పాటు.. తొలిసారి అండ‌ర్ వాట‌ర్ డ్రోన్ల వినియోగం
– కుంభ‌మేళా స‌మాచారం తెలుసుకునేందుకు 11 భార‌తీయ భాషల్లో ఏఐ చాట్‌బాట్‌
– శ‌స్త్ర చికిత్స, రోగ‌నిర్ధార‌ణ సౌక‌ర్యాల‌తో కూడిన తాత్కాలిక ఆసుప‌త్రులు.. ఏక‌కాలంలో 200 మందికి చికిత్స అందించ‌గ‌ల భీషు క్యూబ్ ఏర్పాటు
– నేత్ర కుంభ్ శిబిరం ద్వారా 5 ల‌క్ష‌ల మంది యాత్రికుల‌కు కంటి ప‌రీక్ష‌లు, 3 ల‌క్ష‌లకు పైగా క‌ళ్ల‌ద్దాల పంపిణీకి చర్య‌లు
– మ‌హా కుంభ‌మేళా కోసం అండ‌ర్‌వాట‌ర్ డ్రోన్‌
– అగ్నిప్ర‌మాదాల‌ను క‌ట్ట‌డి చేసేందుకు అందుబాటులో నాలుగు ఆర్టిక్యులేటింగ్ వాట‌ర్ ట‌వ‌ర్స్ వాహ‌నాలు
– లైటింగ్ కోసం సౌర‌శ‌క్తి, పున‌ర్వినియోగ వ‌స్తువ‌ల వినియోగాన్ని ప్రోత్స‌హించ‌డం. ఒకేసారి ఉప‌యోగించే ప్లాస్టిక్‌పై నిషేధం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: ఓటమిపై కేజ్రీ, అతిశి రియాక్షన్ ఇదే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *