Karimnagar: కాంగ్రెస్‌కి ఒక్కప్పుడు కంచుకోటగా పేరున్న జిల్లా కరీంనగర్. ఎంఎస్ఆర్, దుద్దిల్ల శ్రీపాద రావు, పీవీ నర్సింహా రావు లాంటి ఎంతో మంది నేతలను అందించిన జిల్లా. అంతటి కరీంనగర్ జిల్లాకి ఇప్పుడు ఓ DCCని నియమించక పోవడం వివాదాస్పదంగా మారిందట… దీనినే ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.
Karimnagar: కరీంనగర్ Dccరేసులో చాలామంది ఆశావహులు ఉన్నప్పటికీ అందులో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పురుమల్ల శ్రీనివాస్ మధ్య ప్రధాన పోటీ నడుస్తుంది. కరీంనగర్ DCC చేజిక్కించుకొనేందుకు ఇద్దరు నాయకులు లాబీయింగ్ చేస్తున్నారన్న చర్చ జిల్లాలో నడుస్తుంది. వెలిచాల రాజేందర్ రావు ఢిల్లీ అధిష్టానాని కలిసి రాగా పురుమల్ల శ్రీనివాస్ సైతం ఢిల్లీ బాట పట్టి వచ్చారట..అయితే స్థానిక బలం తప్పని సరి అని పార్టీ పెద్దలు తేల్చేశారట.కాంగ్రెస్ పెద్దల మద్దతు కూడబెట్టేందుకు వెలిచాల రాజేందర్ రావు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట.
ఇది కూడా చదవండి: AAA Muggula Poti: ముత్యాల్లాంటి ముగ్గులు వేయండి.. పాతిక లక్షలు పెట్టేయండి..
Karimnagar: స్థానిక మద్దతు తప్పని సరి అని తేల్చడంతో పురుమల్ల శ్రీనివాస్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎలాంటి సమాచారం లేకుండా నేతలతో కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఓ మీటింగ్ నిర్వహించడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సమయంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై గంగుల కమలాకర్ చేసిన కౌంటర్‌ను టాగ్ చేస్తూ కరీంనగర్ DCC అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం చర్చకు దారి తీసింది మరో వైపు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఎటు వైపు పోతున్నాయో తెలియడం లేదనేది హస్తం పార్టీ నేతల మాట… మరో వైపు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నంతో పాటు సీనియర్ నేతలకు తెలియకుండా ఇష్టానుసారంగా సమావేశం ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.
Karimnagar: ఇదే అదనుగా భావించిన మరో వర్గం సోషల్ మీడియాలో కౌంటర్ చేసింది. పార్టీ ఆదేశాలకు విరుద్దంగా వ్యవహరించిన పురుమల్ల శ్రీనివాస్‌పై వేటు వెయ్యాలని పట్టు బట్టిందట.మరో వైపు వెలిచాల రాజేందర్ రావు పార్టీ నాయకులకు అధిష్టానానికి దగ్గరవుతున్నారట..ఇంటి పోరు ఎలా ఉన్న పార్టీలో లొసుగులు సోషల్ మీడియాలో వేదికగా బహిర్గతం అవడం చర్చనీయంగా మారాయి దీనిని ఇటు జిల్లా నాయకత్వం అటు అధిష్టానం ఎలాబ్యాలన్స్ చేస్తుంది.. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిపై వేటు పడనుందా.. ఇప్పటికైనా డీసీసీ పై నిర్ణయం ఉంటుందో లేదో ఎదురు చూడాలి.