Vanara: సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘వానర’. హీరో, దర్శకుడిగా అవినాశ్ తిరువీధుల పరిచయమవుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బైక్‌పై వెళ్తున్న హీరోను హనుమంతుడు కాపాడుతూ కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మంచు మనోజ్ లాంచ్ చేసిన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Also Read: Karthi: ‘మ్యాడ్’ డైరెక్టర్‌తో కార్తీ కొత్త చిత్రం!
అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘వానర’. సిమ్రాన్ చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రముఖ డైలాగ్ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని శంతను పతి సమర్పిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బైక్‌పై వెళ్తున్న హీరో అవినాశ్‌ను రక్షణగా హనుమంతుడు వెంట ఉండటం ఆకట్టుకుంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి స్పందన రేకెత్తించింది. మంచు మనోజ్ లాంచ్ చేసిన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘వానర’ త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

