International: మన దేశం కన్నా ఎంతో వెనుకబడిన మన దాయాది దేశమైన పాకిస్థాన్ దేశం ఓ విషయంలో ముందున్నది. మనం దానికన్నా ఒక స్థానం వెనుకబడి ఉన్నాం. నిజంగా ఆ విషయంలో మనం వెనుకబడి ఉండటంపై కొంత ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే అది భద్రత విషయంలో అన్నమాట. ఎన్నో తీవ్రవాద, నేరాలకు నెలవుగా భావించే పాకిస్థాన్ దేశం అక్కడి పౌరులకు కల్పించే భద్రతే మెరుగ్గా ఉందంటే విశేషమే.
International: నంబియో భధ్రతా సూచికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదికలో 147 దేశాల జాబితాతో ఆ సంస్థ విడుదల చేసింది. ఆ జాబితాలో పాకిస్థాన్ 65వ స్థానలో ఉండగా, మనదేశం 66వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితా వరుసలో ఈ స్థానాలు వెల్లడయ్యాయి. వేర్పాటు వాదం, ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా భావిస్తున్న ఆ పాకిస్థాన్ మన దేశం కన్నా సురక్షిత దేశంగా గుర్తింపు పొందింది.
International: భద్రత విషయంలో సురక్షిత దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఓ చిన్నదేశమైన అండొర్రా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ, ఖతార్, తైవాన్, ఒమన్ నిలిచాయి. ఆయా దేశాల భద్రతా పరిస్థితులు, నేరాల రేటు, ప్రజల జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులను ప్రకటించారు. అదే విధంగా ఆయా దేశాల్లో పర్యటించే పర్యాటకులు, రాత్రివేళ, పగటి వేళల్లో వీధుల్లో నడిచేటప్పుడు స్థానికులు ఎంత భద్రత పొందుతున్నారనే విషయాలను ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు.
International: అపరిచితులపై భౌతిక దాడులు, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు, దోపిడీలు, కార్ల దొంగతనాలు, చర్మం రంగు, జాతి, లింగం, మతం ఆధారంగా వివక్ష వంటి అంశాలనూ పరిశీలించారు. ఆస్తుల వింధ్వంసం, లైంగిక నేరాలు, దాడుల వంటి హింసాత్మక నేరాలను జాబితా కోసం ఆధారాలను సేకరించారు. ఈ జాబితాలో అమెరికాకు 89, బ్రిటన్ 87వ ర్యాంకులతో మన దేశం కన్నా వెనుకనే ఉన్నాయి. అయితే చైనా మాత్రం 15 ర్యాంకుతో ముందే ఉన్నది.
International: ఇదిలా ఉండగా, ప్రమాదకర ఐదు దేశాలను కూడా ఈ నివేదికలో వెల్లడించారు. భద్రత లేని, సురక్షిత కాని టాప్ 5 దేశాలలో వరుసగా వెనెజులా, పవువా న్యూ గినియా, హైతీ, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా దేశాలను గుర్తించారు. ఆయా దేశాల్లో పౌరులకు, పర్యాటకులక సరైన భద్రత లేదని తేల్చారు.

