Crime News

Crime News: ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం.. బావిలో మృతదేహం!

Crime News: మంచిర్యాల జిల్లాలో ఇటీవల జరిగిన అత్యంత అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఏడేళ్ల పసిబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన కిరాతకుల చర్య ప్రజల ఆగ్రహానికి కారణమైంది.

మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో ఏడేళ్ల చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటుండగా, ఆమెకు వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తితో పాటు సతీష్ అనే మరో వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

ఆ పసిబిడ్డకు కుర్‌కురే ప్యాకెట్ కొనిస్తామని ఆశ చూపించి, గ్రామానికి సమీపంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లారు. అక్కడ ఆ ఇద్దరు కిరాతకులు చిన్నారిపై అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

అఘాయిత్యం అనంతరం హత్య, బావిలో మృతదేహం

అత్యాచారం తర్వాత విషయం బయటికి తెలుస్తుందనే భయంతో, ఆ కిరాతకులు మరింత అమానుషంగా ప్రవర్తించారు. ఆ బాలిక గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం, చిన్నారి మృతదేహాన్ని దండేపల్లి మండలం నంబాల గ్రామ శివారులోని ఒక బావిలో పడేశారు.

ఇది కూడా చదవండి: IndiGo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైకి మళ్లింపు

బాలిక రెండు రోజుల క్రితం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే, గ్రామ శివారులోని బావిలో చిన్నారి మహాన్విత (6) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

నిందితులపై పోక్సో కేసు నమోదు

తల్లిదండ్రులు తమ చిన్నారిని ఎవరో చంపి బావిలో వేశారని తీవ్రంగా ఆరోపించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేశారు. విచారణలో భాగంగా పసిబిడ్డ బంధువైన పెద్దనాన్న, సతీష్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది.

నిందితులపై పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారికి జరిగిన అన్యాయంపై స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హేయమైన చర్య సమాజంలో మానవత్వం ఎంత దిగజారిందో తెలియజేస్తోందని పలువురు విచారం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *