Ind Vs Aus: ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఆటగాళ్లు నాలుగో టెస్ట్‌లో భారత జట్టుని చిత్తుగా ఓడించారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించి, సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా 12 సంవత్సరాల తర్వాత టీమిండియాపై (team india) బాక్సింగ్ డే టెస్ట్‌ను గెలుచుకుంది. మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లోని ఐదో, చివరి టెస్ట్ జనవరి 3, 2025 నుంచి సిడ్నీలో జరుగుతుంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు 340 పరుగుల విజయ లక్ష్యం ఉంది. దీంతో భారత జట్టు 155 పరుగులకే కుప్పకూలింది. భారత 9వ వికెట్‌గా జస్ప్రీత్ బుమ్రా ఔట్ అయ్యాడు. బోలాండ్ అతడిని పెవిలియన్ పంపాడు. సున్నా పరుగులకే బుమ్రా ఔటయ్యాడు. స్మిత్ బౌలింగ్ లో అవుట్.
ఈ వార్తలు కూడా చదవండి..
చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్లో డబుల్ సెంచరీ (246) చేసిన షాహిది.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్లో రెండు డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. షాహిది 2021లో జింబాబ్వేపై తొలి డబుల్ సెంచరీ (200) చేశాడు.
తాజాగా డబుల్తో షాహిది మరో రికార్డు కూడా సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (246) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
దంచికొట్టిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం (Big Bash League- బీబీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఈ టీ20 లీగ్ సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. దాదాపు పదకొండేళ్ల అనంతరం బీబీఎల్ తొలిసారి యాభై పరుగుల మార్కును అందుకున్నాడు.
కెప్టెన్గా వార్నర్ అయితే, విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరైన పొట్టి ఫార్మాట్లో(T20 cricket) సుదీర్ఘ విరామం తర్వాత హాఫ్ సెంచరీ బాదిన వార్నర్ భాయ్.. అందుకోసం ఏకంగా 40 బంతులు తీసుకోవడం గమనార్హం. కాగా డిసెంబరు 15 బీబీఎల్ 2024-25 సీజన్ ఆరంభమైంది. ఈ క్రమంలో డిసెంబరు 17న వార్నర్ కెప్టెన్సీలో తమ తొలి మ్యాచ్ ఆడిన సిడ్నీ థండర్ రెండు వికెట్ల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్ను ఓడించింది.