Rajnath Singh: భారత భద్రతా వ్యవస్థపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భారత ఆర్మీ సైనికులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భద్రత విషయంలో భారతదేశం చాలా అదృష్టవంతమైన దేశం కాదని అన్నారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో మన సైన్యం నిరంతరం సవాళ్లను ఎదుర్కొంటోంది. మేము నిశ్శబ్దంగా నిర్లక్ష్యంగా కూర్చోలేము. మన శత్రువులు, లోపల లేదా వెలుపల, ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు అని అయన తెలిపారు.
ఇది కూడా చదవండి: Terrorist: ఐదు రోజులకు ఒక టెర్రరిస్ట్ ఖతం.. ఈ ఏడాది ఎంతమంది పోయారంటే.
ఈ పరిస్థితుల్లో వారి కార్యకలాపాలపై నిఘా ఉంచాలని రాజ్‌నాథ్ అన్నారు. సరైన సమయంలో వారిపై మెరుగైన సమర్థవంతమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది.దేశ రక్షణ మంత్రిగా నేను మీకు చెప్పదలుచుకున్నాను ‘ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి అని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాజ్‌నాథ్ మోవ్ కంటోన్మెంట్‌కు వచ్చారు.