Immunity Booster: చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం సర్వసాధారణం. ఇది తరచుగా జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇటువంటి సందర్భాలలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంచడంలో హోమియోపతి మందులు చాలా ఉపయోగపడతాయి. హోమియోపతి అనేది పురాతన వైద్య విధానం. ఇందులో ఔషధాలను సహజ వనరుల నుండి తయారు చేస్తారు. జలుబు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు వంటి అనేక వ్యాధుల చికిత్సలో హోమియోపతిని ఉపయోగిస్తారు. హోమియోపతి సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులపై బాగా పనిచేస్తుంది. కాబట్టి హోమియోపతి ద్వారా వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..
రోగనిరోధక శక్తి పెంచడానికి..
హోమియోపతిలో లభించే ఎచినాసియా, కాల్కేరియా కార్బోనికా శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి తరచుగా వచ్చే జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. ఫాస్పరస్ ఔషధం గొంతు సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం అందిస్తుంది. అంతేకాకుండా సిలిసియా ఔషధం రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ సంబంధిత వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. హోమియోపతి మిమ్మల్ని మందుల మీద మాత్రమే ఆధారపడేలా చేయదు. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మందులు తీసుకోవడంతో పాటు తగినంత నిద్ర, పోషకమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. మీరు నిద్రపోయే టైమ్, మేల్కొనే సమయం మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి సరిగ్గా నిద్రపోవాలి. వీలైనంత వరకు జంక్ ఫుడ్ తినడం మానుకోండి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
- డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోవద్దు.
- వెచ్చని బట్టలు ధరించి గోరువెచ్చని నీరు తాగాలి.
- చలికాలంలో చల్లటి ఆహారం తినొద్దు.
- తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
- తేలికపాటి వ్యాయామం లేదా యోగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

